ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద మోసం: చంద్రబాబు - పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు

రాజధానికి భూములిచ్చిన రైతులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూములను పట్టాలుగా మార్చి.. పేదలకు, రైతులకు మధ్య గొడవలు పెడుతున్నారని ఆరోపించారు.

chandra babu on lands to poor
పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు

By

Published : Mar 4, 2020, 9:30 PM IST

ట్విటర్​లో చంద్రబాబు షేర్ చేసిన వీడియో

రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం.. పెద్ద మోసమని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం కట్టించి సిద్ధం చేసిన ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆ ఇళ్ల కోసం పేదలు కట్టిన డబ్బు సంగతేంటని నిలదీశారు. పేదల బాండ్లకు ఈ ప్రభుత్వం జవాబుదారీ కాదా అన్నారు. తమకిచ్చిన ప్లాట్లు వేరేవాళ్లకు ఎలా ఇస్తారని నిరుపేదలు ప్రశ్నిస్తున్నారని.. ఇప్పటికే కట్టిన డబ్బుకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

ఇంకోవైపు ఇంటి అద్దెలు చెల్లించలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పేదలకు భుముల పట్టాలిచ్చి రైతులకు,పేదలకు తగాదాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్న వారికి.. ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని చంద్రబాబు నిలదీశారు. ఈ మేరకు ఓ వీడియోను చంద్రబాబు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details