అన్నదాతకు సంకెళ్లు వేయడం ఏమిటని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాయపాలెం రైతులపై అట్రాసిటీ కేసు పెట్టడం సరైంది కాదని దుయ్యబట్టారు. తాను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నానని ఈపూరి రవి పోలీసులకు విజ్ఞప్తి చేశారని.. అయినా పోలీసులు తమ అక్రమ కేసులను సరిచేసుకోకపోగా అన్నదాతలకు సంకెళ్లు వేయడం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు.
రైతులకు సంకెళ్లు వేయటం విద్రోహ చర్య అవుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు. వాటిని ధిక్కరించే విధంగా పోలీసుల చర్య ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఈ మానవహక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.