అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటూ ఆకాశమే హద్దుగా స్త్రీ మూర్తులు ఎదుగుతున్నారని చంద్రబాబు కొనియాడారు. స్త్రీ సమానత్వం, సాధికారతలే మన సమాజ ప్రగతికి మూలమని వ్యాఖ్యానించారు.
'స్త్రీ సమానత్వం, సాధికారతే సమాజ ప్రగతికి మూలం' - women's day 2020
అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా మహిళలు ఎదుగుతున్నారని చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
chandra babu, lokesh women day celebrations
ప్రతి రంగంలోనూ తన సత్తా చాటుతూ సమాజ ప్రగతికి, కుటుంబ సంక్షేమానికి సమాన బాధ్యతను నిర్వర్తిస్తోన్నది స్త్రీ మూర్తులని లోకేశ్ పేర్కొన్నారు. స్త్రీ ప్రగతిని ఓర్వలేని అహంకార నేతల పాలన నడుస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళలపై అందుకే దాడులు జరుగుతున్నాయని లోకేశ్ అన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం'