ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విదేశాంగ మంత్రి జై శంకర్​కు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..? - latest news on students stucked in manila

మనీలాలోని భారత విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకురావాలని తెదేపా అధినేత చంద్రబాబు.. విదేశాంగ మంత్రి జై శంకర్​కు లేఖ రాశారు. ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరారు. దిల్లీ, హైదరాబాద్​కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి.. విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు.

chandra babu letter to foreign minister
విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

By

Published : Mar 19, 2020, 2:57 PM IST

Updated : Mar 19, 2020, 4:54 PM IST

విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

ఫిలిప్పీన్స్‌ మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న 146 మంది భారతీయులను వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వారిలో 41 మంది ఏపీకి చెందినవారు కాగా.. 30 నుంచి 40 మంది తెలంగాణ విద్యార్థులున్నారని తెలిపారు. వీరిలో అనేకమంది ఎంబీబీఎస్​ చదివేందుకు ఫిలిప్పీన్స్‌కు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు.

భారత్​ వచ్చేందుకు మార్చి17వ తేదీన మనీలా విమానాశ్రయానికి చేరుకున్న వీరు..ఆకస్మికంగా విమానాలన్నీ రద్దవటంతో అక్కడే చిక్కుకుపోయారని చంద్రబాబు లేఖలో వివరించారు. స్వస్థలాలకు చేరేందుకు విమానాలు లేవని, ఈరోజు అర్ధరాత్రికి ఎయిర్ పోర్ట్ మూసేస్తున్నట్లు సమాచారం ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. దీని వల్ల అక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. తక్షణమే స్పందించి విద్యార్థులను మనీలా నుంచి స్వస్థలాలకు చేర్చేలా శ్రద్ధ చూపాలని కోరారు. దిల్లీ, హైదరాబాద్​కు ప్రత్యేక విమానంలో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

'ఆరు గంటలకు ఒకసారి పారాసిటమాల్ వేసుకోండి'

Last Updated : Mar 19, 2020, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details