జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికాధిపతులకు, పాత్రికేయులకు, పత్రికా రంగంలో సేవలందిస్తోన్న ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు బాధ్యతాయుత పాత్రను పోషిస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుందన్నారు. అందులో భాగంగానే జీవో 938కు, 2430కు వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీవో 2430ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాలని వైకాపా ప్రభుత్వానికి సూచించారు.
'తెదేపా ఎప్పుడూ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుంది' - chandra babu on media
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికాధిపతులకు, పాత్రికేయులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీవో 2430ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మీడియాపై చంద్రబాబు