ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాజధాని మార్చాలనుకుంటే... మళ్లీ ఎన్నికలకు రండి'

By

Published : Jan 13, 2020, 4:47 PM IST

రాజధానిని మార్చాలనుకుంటే... ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అనంతపురంలో అమరావతి పరిరక్షణ యాత్ర చేస్తున్న చంద్రబాబు... మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

chandra-babu-fires-on-ysrcp-government-on-capital-issue
chandra-babu-fires-on-ysrcp-government-on-capital-issue

వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు వ్యాఖ్యలు

రాజధానిని మార్చాలనుకుంటే మళ్లీ ఎన్నికలకు రావాలని... వైకాపాకు చంద్రబాబు సవాల్ విసిరారు. అమరావతి రాష్ట్ర ప్రజలందరిదని వివరించారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఎంపీ రేవంత్‌ రెడ్డి బాధపడిన విషయం గుర్తుచేశారు. అమరావతి రాజధాని అన్నప్పుడు ప్రజలంతా ఒప్పుకున్న విషయం గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా అని ప్రశ్నించారు. భావితరాల కోసమే తాను పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

అభివృద్ధి కావాలంటే సాగుభూములు, పరిశ్రమలు, నీరు కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు. రాయలసీమకు నీరివ్వాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదన్నారు. వైకాపా ప్రభుత్వ చర్యల వల్ల 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి.. బంగారు గుడ్లు పెట్టే బాతు అని చెప్పారు. రూ.2 లక్షల కోట్ల విలువైన ఆస్తిని వాడుకోవడం వైకాపా ప్రభుత్వానికి చేతకావట్లేదని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details