'ప్రజా స్పందనతోనైనా కళ్లు తెరవండి' - chandra babu fires on sand issue
ఇసుక దీక్షకు వచ్చిన స్పందనతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలన్నీ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఇసుక సమస్యపై చంద్రబాబు
ఇసుక దీక్షకు వెల్లువెత్తిన ప్రజా స్పందనతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన 12 గంటల నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రతిపక్షాలన్నీ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.