సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం సోలీ సోరాబ్జీ పాటుపడ్డారని ఆయన పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలిగేలా ఆకాంక్షించారు. సోలీ సోరాబ్జీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సోలీ సోరాబ్జీ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి - సోలీ సోరాబ్జీ మృతికి చంద్రబాబు సంతాపం
ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సోరాబ్జీ శుక్రవారం ఉదయం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
chandra babu condolence to soli sorbji