ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన చంద్రబాబు - potti sriramulu death anniversary

పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందామని చంద్రబాబు అన్నారు.

chandra babu condolence to potti sri ramula
chandra babu condolence to potti sri ramula

By

Published : Mar 16, 2021, 2:41 PM IST

పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. అంతకుముందే ఎస్సీల ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం కూడా అహింసాయుత పోరాటం చేశారని గుర్తు చేశారు.

ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పయ్యావుల కేశవ్, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల23న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ABOUT THE AUTHOR

...view details