ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్రహ్మకుమారి దాది జానకి మృతి పట్ల చంద్రబాబు సంతాపం - బ్రహ్మకుమారి దాది జనకి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

బ్రహ్మకుమారి ముఖ్య సంచాలిక 'దాది జానకి' మృతిపట్ల చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో దాది జానకి సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు అన్నారు

chandra babu condolence to dadi janaki
బ్రహ్మకుమారి దాది జనకి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

By

Published : Mar 27, 2020, 4:32 PM IST

ప్రజాపిత బ్రహ్మకుమారి ముఖ్య సంచాలిక 'దాది జానకి' పరమపదించడంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజం గొప్ప ఆధ్మాత్మికవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. శాంతి, సంతోషం, సకారాత్మక దృష్టి పెంచడం ద్వారా సమాజాన్ని సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారన్నారు. సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో దాది జానకి సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు అన్నారు. రాజయోగ అభ్యాసం, సత్యాన్వేషణ, మానవతా విలువల పెంపు ద్వారా సమాజాన్ని జాగృతం చేశారని తెలిపారు. భౌతికంగా దాది జానకి మనకు దూరమైనా ఆమె స్ఫూర్తి అనుక్షణం మన వెన్నంటే ఉంటుందన్నారు. ఆమె చూపిన బాటలో నడవడమే జానకి దాదికి మనం అందించే నివాళిగా చంద్రబాబు పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details