వైకాపా నేతల దాడులు, అక్రమ కేసులతో రాష్ట్రం అస్తవ్యస్తమైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తున్న నేతలపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరవైందని అన్నారు.
వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ రావడంపై సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దోషులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని.. వర్ల రామయ్య కుటుంబీకులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వేధిస్తారా అని ప్రశ్నించారు.