బడుగుల కోసం గౌతు లచ్చన్న జీవితం అంకితం చేశారని, ఆయన మనవరాలని ఆరోపణలతో వేధించడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దేశభక్తులకు, దొంగలకు తేడా తెలియకపోతే దుష్పరిణామాలు ఉంటాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల తన సంస్కారం ఏపాటిదో జగన్ చాటుకున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఆడకూతురిని వేధిస్తారా? అని నిలదీశారు. విచారణ పేరుతో ఏడు గంటలపాటు గౌతు శిరీషను వేధించారని మండిపడ్డారు.
ఆడకూతురుని వేధిస్తారా.. ప్రజలు అన్నీ చూస్తున్నారు : చంద్రబాబు
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారనే అభియోగంతో.. గౌతు శిరీషను సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గౌతు లచ్చన్న మనవరాలిని వేధించడం దారుణమన్న బాబు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.
chandra babu
మహిళల పట్ల సాగిస్తున్న కుళ్లు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆదేశాలను పోలీసులు గుడ్డిగా పాటిస్తున్నారన్న తెదేపా అధినేత.. మహిళలపై నేరాలను అరికట్టడడంలో పోలీసులు తమ పనితనం చూపించాలని సూచించారు. ప్రభుత్వ పెద్దలతోపాటు పోలీసు దిగజారి.. వ్యవస్థ గౌరవాన్ని తగ్గించకూడదని హితవు పలికారు. ఎంత వేధించినా ఏమీ చేయలేరన్న బాబు.. గౌతు శిరీష ధైర్యం ముందు ప్రభుత్వ పెద్దలు ఎప్పుడో ఓడిపోయారని ఎద్దేవా చేశారు.