ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నరేగా పెండింగ్‌ బిల్లులు చెల్లించే వరకూ న్యాయవాదులు పోరాడాలి' - tdp on comment on ysrcp government

హైకోర్టు న్యాయవాదుల బృందంతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు చెల్లించే వరకూ పోరాడాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం ద్వారా వైకాపా కక్ష సాధిస్తోందని చంద్రబాబు అన్నారు.

tdp national president chandra babu
tdp national president chandra babu

By

Published : Mar 30, 2021, 8:17 PM IST

రాష్ట్రంలో నరేగా పెండింగ్ బిల్లులన్నింటినీ వైకాపా ప్రభుత్వం చెల్లించే వరకూ న్యాయవాదులు పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్​లో హైకోర్టు న్యాయవాదుల బృందంతో సమావేశమై నరేగా బిల్లుల చెల్లింపు అంశం చర్చించారు.

నరేగా బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే విషయాన్ని న్యాయవాదులు చంద్రబాబుకు వివరించారు. రెండేళ్లుగా నరేగా బిల్లలు చెల్లించకపోవటంతో 7 లక్షల మంది ఉపాధి కూలీలు ఇబ్బంది పడ్డారన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన వారిపై కక్షసాధింపు చర్యలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని చంద్రబాబు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details