ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజల్లోకి చంద్రబాబు.. త్వరలో తెదేపా బస్సు యాత్ర - chandra babu bus tour on government behaviour

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి వెళ్లేందుకు తెదేపా నేతలు కసరత్తు చేస్తున్నారు. బస్సు యాత్రతో జనాన్ని కలవాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.

chandra babu bus tour on government behaviour
చంద్రబాబు బస్సు యాత్ర

By

Published : Feb 11, 2020, 7:14 PM IST

Updated : Feb 11, 2020, 7:42 PM IST

ప్రభుత్వ వైఫల్యాలపై తెదేపా నేతలు బస్సుయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. 13 జిల్లాలు, వందకు పైగా నియోజకవర్గాలు చుట్టేలా.. 45 రోజుల ప్రణాళికను చంద్రబాబు సమావేశంలో ప్రతిపాదించారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యాత్ర చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వ తప్పిదాలపై జనచైతన్య యాత్ర చేద్దామని చంద్రబాబు చెప్పిన మేరకు... ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్​ఛార్జుల నేతృత్వంలో 45 రోజుల పాటు.. 175 నియోజకవర్గాలు చుట్టేలా యాత్రకు నిర్ణయించినట్టు సమాచారం.

Last Updated : Feb 11, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details