రాష్ట్రంలో ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం! - latest news of meatorlogical department
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
chances for rain in andhrapradesh state
రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని చాలా చోట్ల వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వర్షంతో పాటు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.