ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం... మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన - రాష్ట్రంలో వర్షాల వార్తలు

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని... తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు వెల్లడించారు. మత్స్య కారులు మంగళవారం వరకూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

weather report
వర్ష సూచన

By

Published : Jul 10, 2021, 8:57 AM IST

ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా ప్రాంతం ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు సముద్రం అలజడిగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు వెల్లడించారు. మత్స్యకారులు మంగళవారం వరకూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

అల్పపీడనం ప్రభావంతో నేడు మోస్తరు వర్షాలు, ఆది, సోమవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు, భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతానికి అవకాశముందన్నారు. ఆదివారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షపాతానికి అవకాశముందని వివరించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details