ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దూసుకొస్తున్న 'యాస్'...రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం!

తూర్పుతీరంవైపు యాస్ తుపాను దూసుకొస్తుంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Yass cyclone Effect on East Coast
Yass cyclone Effect on East Coast

By

Published : May 25, 2021, 10:40 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుపాను మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద రేపు సాయంత్రానికి ఇది తీరం దాటనుందని తెలిపింది. పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉన్నందున..ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

యాస్‌ ప్రభావంతో రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. రేపు కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను హెచ్చరికలతో ఇప్పటికే కీలకప్రాంతాల్లో సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను యంత్రాంగం మోహరించింది.

ABOUT THE AUTHOR

...view details