ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CCTV video: లిఫ్ట్​ కోసం వేచిచూస్తుంటే.. దొంగ వచ్చి.. - chain snatching in hyderabad

Chain snatching cctv video: హైదరాబాద్ కేపీహెచ్​బీ కాలనీ రోడ్​ నెంబర్-2లో నిన్న రాత్రి గొలుసు దొంగ రెచ్చిపోయాడు. అపార్ట్​మెంట్​లో నివసించే ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించాడు.

CCTV video
CCTV video

By

Published : Jan 5, 2022, 2:54 PM IST

Chain snatching cctv video: ఓ మహిళను ఫాలో అయిన దుండగుడు అపార్ట్​మెంట్​ లోనికి వచ్చి.. బంగారు గొలుసు చోరీకి పాల్పడిన సంఘటన హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్​బీ కాలనీ రోడ్ నంబర్-2 లోని ఓ అపార్ట్​మెంట్​లో నివసించే పద్మజారెడ్డి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కిరాణా దుకాణానికి వెళ్లి వస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ద్విచక్ర వాహనంపై అనుసరించాడు.

అలా వారు నివసించే అపార్ట్​మెంట్​ వరకూ వచ్చిన దుండగుడిని గమనించిన పద్మజారెడ్డి.. అతడిని ఎవరు కావాలని అడిగారు. తాను సత్యనారాయణ అనే వ్యక్తి కోసం వచ్చినట్లు తెలిపాడు. ఆ పేరుతో ఎవరూ లేరని పద్మజారెడ్డి చెప్పగా.. ఫోన్ కలవటం లేదని మాట్లాడుతూ భవనం లోపలే తచ్చాడాడు.

CCTV video: లిఫ్ట్​ కోసం వేచిచూస్తుంటే.. బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు.!

లిఫ్ట్​ కోసం నిలబడితే..
ఈ క్రమంలో ఆమె లిఫ్ట్ వద్ద నిలబడటంతో.. ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దుండగుడిని నిలువరించే ప్రయత్నంలో తాను కిందపడిపోయానని.. లేచి వెళ్లి చూసే సరికి ద్విచక్ర వాహనంపై పారిపోయాడని బాధితురాలు తెలిపారు.

నిన్న రాత్రి నేను సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి వస్తుండగా.. ఒకతను నన్ను వెంబడించాడు. ఎవరు మీరని ఆరా తీస్తే.. సత్యనారాయణ కోసం వచ్చానని తెలిపాడు. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరని చెబితే.. పక్కకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చాడు. ఆయనకు ఫోన్​ చేస్తే కలవడం లేదు.. ఇక్కడే ఉంటారు అని దుండగుడు చెప్పాడు. నేను ఫోన్​ చేస్తాను.. నెంబరు ఇవ్వండి అని లిఫ్ట్​ వద్దకు వెళ్తుంటే అకస్మాత్తుగా నా మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. తేరుకునేలోపు అక్కడి నుంచి పారిపోయాడు. - పద్మజారెడ్డి, బాధితురాలు

దుండగుడు.. తన ముఖం ఎవరికీ కనిపించకుండా మాస్కుతో పాటు హెల్మెట్​ ధరించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్‌ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Minor Girl Rape Case: బయటికెళ్లిన బాలికపై అత్యాచారం.. ఆపై..!

ABOUT THE AUTHOR

...view details