ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం ఇలా చేస్తే.. యువతకు ఉద్యోగాలు ఎవరిస్తారు?' - దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు వార్తలు

ఒకసారి ఒప్పందం చేసుకుని పెట్టుబడి పెట్టాక పున:సమీక్షిస్తామంటే పరిస్థితి ఏమిటి? పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ఎలా ముందుకు వస్తారు? ఇలాగైతే వ్యాపారాలు చేయలేం.. అంటూ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

chadrababu comments in twitter
chadrababu comments in twitter

By

Published : Jan 27, 2020, 9:05 AM IST

రాష్ట్రంలో పరిస్థితులపై.. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వ్యాపారవేత్తలు ఆందోళన చెందారు. వ్యాపార ఒప్పందాల అమల్లో చిత్తశుద్ధి లేకపోతే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని అన్నారు. ఏపీతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష అంశాన్ని వారు ప్రస్తావించారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన వ్యాపారరంగ ప్రముఖులు.. అక్కడ ‘బిజినెస్‌టుడే’ ప్రతినిధితో మాట్లాడారు.

తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్

‘పీపీఏలు చాలా ప్రధాన సమస్య. ఏపీతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఇది ఉంది. ఒకసారి ఒప్పందం చేసుకుని పెట్టుబడి పెట్టాక పున:సమీక్షిస్తామంటే పరిస్థితి ఏమిటి? పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ఎలా ముందుకు వస్తారు? ఇలాగైతే వ్యాపారాలు చేయలేం’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. పెట్టుబడిదారులు వెనక్కి వెళ్తే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు సృష్టించేదెవరు? అని ప్రశ్నించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details