ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bharat Biotech: భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు సీఈపీఐ నిధులు

bharat biotech: భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు.. కొయలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్‌ నిధులు సమకూర్చనుంది. కరోనాపై సమర్థంగా పనిచేసే టీకా తయారీకి వీటిని ఉపయోగించనున్నారు.

భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు సీఈపీఐ నిధులు
భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు సీఈపీఐ నిధులు

By

Published : May 10, 2022, 9:56 PM IST

bharat biotech: అన్ని రకాల కొవిడ్ వేరియంట్‌లపై సమర్థంగా పనిచేసే టీకా తయారీకి భారత్‌ బయోటెక్‌తో కూడిన కన్సార్షియంకు.. సీఈపీఐ సంస్థ నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చిందని భారత్ బయోటెక్ ప్రకటించింది. భారత్‌ బయోటెక్‌ కన్సార్షియంకు 19.3 మిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చనున్నట్టు వెల్లడించింది.

ఈ మొత్తంతో వేరియెంట్ ఫ్రూఫ్ సార్స్‌ కొవిడ్-2 టీకా తయారీతోపాటు క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తామని వెల్లడించింది. సీఈపీఐ నిధుల కేటాయింపుపై భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కొనే టీకా తయారీ కోసం యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, ఆస్ట్రేలియా, ఎక్సెల్ జీన్-ఎస్​ఏ సంస్థలతో కలిసి.. భారత్ బయోటెక్ గతంలోనే కన్సార్షియంను ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details