ఏపీ రాజధాని అమరావతి అంశంపై కేంద్రం ప్రభుత్వం మరోసారి స్పందించింది . పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇస్తూ... రాజధాని ఏర్పాటు అంశం తమ పరిధిలోనిది కాదని స్పష్టం చేసింది. ఏపీలో కొత్త రాజధానుల చట్టంపై తమకు సమాచారం ఇవ్వలేదని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
రాజధాని ఏర్పాటు మా పరిధిలోనిది కాదు: కేంద్రం - three capitals for ap
15:06 August 19
రాజధాని ఏర్పాటులో మా ప్రమేయం ఉండదు- కేంద్రం
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఎ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రం మరో అఫిడవిట్ సమర్పించింది. 2014 ఏప్రిల్ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొందని అఫిడవిట్ కేంద్రం పేర్కొంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి నిధులు విడుదల చేశామని వివరించింది. రాజధాని నిర్ణయించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని తెలిపింది. రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అఫిడవిట్‌లో చెప్పింది. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం కింద..మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి తీసుకు రాలేదని స్పష్టం చేసింది. రాజధానిపై చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ప్రస్తావించింది.
ఇదీ చదవండి