జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు పదో విడతగా రూ.6వేల కోట్ల రుణాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. వీటిలో ఏపీకి రూ.119.82 కోట్లు, తెలంగాణకు రూ.129.57 కోట్లను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు అందజేసిన రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,433.25 కోట్లు, తెలంగాణకు రూ.947.73 కోట్లు కేంద్రం నుంచి రుణాలుగా అందాయి.
ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం రుణంగా ఇచ్చింది. పదో విడతలో జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన లోటును కేంద్రమే పరిహారం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి మొత్తాన్ని రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేసి రుణాలుగా అందజేస్తోంది. ఇప్పటి వరకు సగానికి పైగా రుణాలను కేంద్రం రాష్ట్రాలకు అందజేసింది.