Centre On AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా బదులుగానే ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలని ఏపీ సీఎం ఇటీవల కోరారని.. నీతిఆయోగ్‌తో భేటీలోనూ సీఎం ప్రస్తావించారని ఆయన వెల్లడించారు.
Centre On Special Package to AP: గతంలో ఏపీ ప్రభుత్వం కోరినందునే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత తమదేనని.. ఏపీకి సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ఏపీకి 2015-19 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించామని తెలిపింది. ఏపీ ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు రుణం సమకూర్చామని వివరించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ. 22,112 కోట్లు ఇచ్చామని చెప్పింది. 2020-21లో ఏపీకి రూ.5,897 కోట్లు అందించినట్లు ప్రస్తావించింది. వీటితో పాటు ప్రత్యేక ప్యాకేజీ వివరాలు వెల్లడించింది.