ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విభజన హామీలు చాలా నేరవేర్చాం.. మరికొన్ని అమలు దశలో ఉన్నాయి - కేంద్రం - YSRCP MPs Meet Nirmala Sitharaman news

Centre On AP Bifurcation Promises: విభజన హామీలు చాలా వరకు నెరవేరాయని.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు.. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ap bifurcation promises
ap bifurcation promises

By

Published : Dec 22, 2021, 7:23 PM IST

Centre On AP Bifurcation Promises: విభజన హామీలు చాలా వరకు నెరవేరాయని కేంద్రం వెల్లడించింది. తెదేపా ఎంపీ కనకమేడల అడిగి ప్రశ్నకు.. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. మరికొన్ని హామీల అమలు.. పలు దశల్లో ఉన్నాయని పేర్కొంది. విభజన హామీల అమలుకు మూడేళ్ల సమయం ఉందన్న కేంద్ర హోంశాఖ.. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు హోంశాఖ 25 సార్లు సమీక్షలు చేశామని మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక జవాబు ఇచ్చారు.

కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి వైకాపా ఎంపీలు..
YSRCP MPs Meet Nirmala Seetharaman:దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను వైకాపా ఎంపీల బృందం కలిసింది. విజయసాయిరెడ్డి నేతృత్వంలో కలిసిన పార్లమెంట్ సభ్యులు.. రాష్ట్ర సమస్యలను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details