ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PDRP: జనవరి 7, 8 తేదీల్లో పోలవరం డ్యామ్‌ డిజైన్ రివ్యూ ప్యానెల్ భేటీ - Polavaram Dam Design Review Panel news

Polavaram Dam Design Review Panel
Polavaram Dam Design Review Panel

By

Published : Dec 31, 2021, 9:17 PM IST

Updated : Dec 31, 2021, 10:10 PM IST

21:13 December 31

కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ బి.పాండ్య నేతృత్వంలో డీడీఆర్పీ భేటీ

Polavaram Dam Design Review Panel(PDRP): పోలవరం ప్రాజెక్టులోని డిజైన్లను పరిశీలించేందుకు కేంద్ర బృందం.. ఏపీకి రానుంది. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ అనుమతులు రావాల్సి ఉన్న కొన్ని డిజైన్లను పరిశీలించి కేంద్రానికి నివేదించనుంది. జనవరి 7,8 తేదీల్లో కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ బి.పాండ్య నేతృత్వంలో డీడీఆర్పీ సమావేశం జరగనుంది.

జనవరి 7 తేదీన పోలవరం ప్రాజెక్టు వద్దే డ్యామ్ డిజైన్లను పరిశీలించి డీడీఆర్పీ సభ్యులు సమావేశం కానున్నారు. తదుపరి 8 తేదీన రాజమహేంద్రవరంలో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ పాండ్య నేతృత్వంలో సీడబ్ల్యూసీ మాజీ చీఫ్ ఇంజనీర్, ఎన్ హెచ్ పీసీ ప్రతినిదులు, ఏపీ ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్ సమావేశం కానున్నారు.

ఏపీకి కేంద్ర బృందం.. ప్రాజెక్టుల భద్రత పరిశీలన
Central team to visit Srisailam: జనవరి 3, 5 తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. శ్రీశైలం రిజర్వాయర్, ధవళేశ్వరం డ్యామ్ భద్రతను పరిశీలించనుంది. 3 తేదీన శ్రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్టును, 5 తేదీన కాటన్ బ్యారేజీలను అధికారులు పరిశీలిస్తారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.

ఇదీ చదవండి :

MP Madhavi Video: వరి కుప్ప నూర్పులో.. బిజీబిజీగా ఎంపీ మాధవి దంపతులు

Last Updated : Dec 31, 2021, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details