సీఎం జగన్‌తో కేంద్ర బృందం సమావేశం(Central Team Meet CM Jagan) ముగిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడ్రోజులు పర్యటించామని(Central team visits flood-hit areas in Andhra Pradesh).. వరదల వల్ల కడప జిల్లాకు భారీ నష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యుడు కునాల్ సత్యార్థి చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అందజేశారు.
వరదల ధాటికి పంటలు కొట్టుకుపోయాయని, పశువులు చనిపోయాయని కేంద్ర బృందం(Central team report on flood hit areas in Andhra Pradesh) ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు బాగా దెబ్బతిన్నాయని.. అన్నమయ్య ప్రాజెక్టు తెగిన చోట అపార నష్టం జరిగిందని పేర్కొంది. మొత్తం వరద నష్టంలో.. 40 శాతం వరకు రోడ్లు, భవనాల ధ్వంసం రూపంలో జరిగిందని నివేదికలో ప్రస్తావించింది. 32 శాతం నష్టం.. సాగు, అనుబంధ రంగాల్లో జరిగిందని.. వీలైనంత మేర ఆదుకునేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.
వెంటనే నిధులు ఇచ్చేలా చూడండి - సీఎం జగన్
వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు(cm jagan on flood affected areas) తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కోరారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో సమర్థ వ్యవస్థ ఉందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రం, ప్రతీ రైతు పంట ఇ–క్రాప్‌లో నమోదవుతుందని వివరించారు. ఇ–క్రాప్‌నకు సంబంధించి రైతుకు రశీదు కూడా ఇచ్చామని వెల్లడించారు.