ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విధుల నిర్వహణలో సెల్​ఫోన్​ వినియోగం.. నిషేధం విధించిన అధికారులు

Ban on Cell Phones: పని సమయాల్లో ఉద్యోగుల సెల్​ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు సీపీడీసీఎల్ వెల్లడించింది. సీపీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాల్లోని జోనల్, రీజినల్, స్థానిక కార్యాలయాల్లో ఈ నిబంధన వర్తిస్తుందని సీపీడీసీఎల్ ఎండీ పేర్కొన్నారు.

CPDCL
సీపీడీసీఎల్

By

Published : Sep 27, 2022, 3:28 PM IST

Ban on Cell Phones in APCPDCL: విధులు నిర్వహించే సమయాల్లో ఉద్యోగులు సెల్​ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. సీపీడీసీఎల్​కు చెందిన పరిపాలనా కార్యాలయాల్లో సెల్ ఫోన్లపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఓఎస్ఓలు, రికార్డు అసిస్టెంట్​లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్​లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా సెల్​ఫోన్లను కార్యాలయం బయటే డిపాజిట్ చేసి రావాలని నిబంధన పెట్టారు. విధులు నిర్వహించే సమయంలో సెల్ ఫోన్ల వినియోగం కారణంగా పనివేళలు వృథా అవుతున్నట్టు గుర్తించామని సీపీడీసీఎల్ స్పష్టం చేసింది. సీపీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాల్లోని జోనల్, రీజినల్, స్థానిక కార్యాలయాల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఉద్యోగులు కేవలం భోజన విరామ సమయంలో మాత్రమే సెల్​ఫోన్లు వినియోగించుకునేందుకు అవకాశముంటుుందని కార్యాలయ విధులు నిర్వహించే సమయంలో సెల్​ఫోన్లు తీసుకురావొద్దని తెలిపారు. కుటుంబానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఉన్నతాధికారుల సెల్​ఫోన్ నెంబరును ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీడీసీఎల్ పేర్కొంది. 2022 అక్టోబరు 1న తేదీ నుంచి సెల్​ఫోన్లపై నిషేధం ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడించారు. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details