పీపీఏలపై ఏపీని గట్టిగా హెచ్చరించాం: కేంద్రమంత్రి - central minister rk singh comments on ap news
పీపీఏల పునఃసమీక్ష అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అన్నారు. దిల్లీలో మింట్ పత్రిక ఆధ్వర్యంలో ఇంధన రంగంపై సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో కొండప్రాంత రాష్ట్రాల్లో ఎక్కువ విద్యుత్ నష్టాలున్నాయని.... ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, బిహార్ డిస్కంలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు డిస్కంలన్నీ నష్టాల్లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
central minister rk singh comments on ap over review on PPAs