ఏపీలో ఆ మూడు ప్రాజెక్టులు 2024లోగా పూర్తవుతాయి: కేంద్రమంత్రి
ఏఐఐబీ(ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు) ఆర్థిక సాయంతో ఏపీలో చేపట్టిన 3 ప్రాజెక్టులు... 2024 కల్లా పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఆర్థిక సాయంతో... ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన 3 ప్రాజెక్టులు 2024 కల్లా పూర్తవుతాయని కేంద్రం తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 24 గంటల విద్యుత్తు, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు, పట్టణ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్టులు 2024 నాటికి పూర్తవుతాయని వివరించారు. రూ.14 వేల 252 కోట్లు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులకు... రూ.7 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవడానికి ఏఐఐబీ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి : తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి... విచారణకు రావాలి..!