ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసీఆర్‌ ప్రభుత్వం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం: పీయూష్‌ గోయల్‌ - కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్

Minister Piyush goyal on KCR Govt: కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. రా రైస్‌.. ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదని.. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు సమాధానం చెప్పాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్‌ సేకరణ జరుగుతోందని మంత్రి వెల్లడించారు.

minister piyush goyal on kcr government
కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్

By

Published : Mar 24, 2022, 10:48 PM IST

కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం: మంత్రి గోయల్​

Piyush goyal on Paddy Procurement: అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్‌ సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. రా రైస్‌ కేంద్రానికి ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదని.. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు రా రైస్‌ ఎంత ఇస్తాయో చెప్పాయని కేంద్ర మంత్రి వివరించారు.

ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. తెలంగాణ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రి.. ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతులకు బాసటగా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు.

రెండు మాకు సమానమే

తెలంగాణ పట్ల మాకు ఎలాంటి వివక్ష లేదు. తెలంగాణ నేతలు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది.తెలంగాణ రైతులకు బాసటగా ఉంటాం. ముడిబియ్యం సేకరణకు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం. పంజాబ్‌తో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తాం. పంజాబ్‌, తెలంగాణ రెండు మాకు సమానమే. ఏపీ 25లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిబియ్యం ఇచ్చింది. -పీయూష్‌ గోయల్​, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details