ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.26,441 కోట్ల మేర ఉందని, ఇది బడ్జెట్ అంచనాలకంటే అధికమని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి పేర్కొన్నారు. ‘ఏపీలో ఆర్థిక ఉల్లంఘనలు’ అంశంపై తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు గతేడాది డిసెంబరు 14న లోక్‌సభలో 377వ నిబంధన కింద మాట్లాడిన అంశాలపై కేంద్ర మంత్రి వివరణ ఇస్తూ తాజాగా లేఖ రాశారు. ‘మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం రెవెన్యూ లోటు రూ.26,441 కోట్లు ఉంది. ఆ ఏడాది అమ్మఒడి (రూ.6,349.47 కోట్లు), తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా (రూ.4,919.84 కోట్లు) పథకం కారణంగా ఇది తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ.1,511 కోట్ల మేర తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం 2020 ఆగస్టు 30నుంచి అమల్లోకి వచ్చేలా ఆ ఏడాది డిసెంబరులో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించింది. సవరించిన చట్టంలో పేర్కొన్న లక్ష్యాలు 14వ ఆర్థిక సంఘం సూచించిన ఆర్థిక సమతౌల్య అంశాలకు విరుద్ధంగా ఉన్నట్లు కాగ్ గుర్తించింది.’ అని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక సంక్షోభంపై జోక్యం చేసుకోండి