ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FUNDS TO AP: ఏడేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం చేసిన ఆర్థిక సాయం ఎంతంటే..! - central minister on funds

ఏడేళ్లుగా రాష్ట్రానికి వివిధ రూపాల్లో అందించిన ఆర్థిక సహాయం వివరాలను పార్లమెంట్​లో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గతేడాది రూ.12,851 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ నరిసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

central minister on funds
కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి

By

Published : Aug 10, 2021, 9:40 PM IST

Updated : Aug 10, 2021, 9:48 PM IST

ఏడేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం వివరాలను కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గతేడాది రూ.12,851 కోట్లు.. ఇతర పథకాల కింద రూ.621 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ నరిసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఏపీ విభజన చట్టం ప్రకారం ఇప్పటివరకు రూ.19,427.366 కోట్లు ఇచ్చినట్లు మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. 2014-15 నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో రూ.59,496.81 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. విదేశీ సంస్థల సహాయంతో రూ.39,343 కోట్లతో 14 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు పార్లమెంట్​లో వెల్లడించారు.

Last Updated : Aug 10, 2021, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details