ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KISHAN REDDY: 'రాజ్యాంగ అసలు ప్రతులను యాప్ రూపంలో తీసుకువస్తాం'

భారతదేశ రాజ్యాంగ (INDIAN CONSTITUTION) అసలు ప్రతుల డిజిటైలేజేషన్​ను (DIGITALIZATION) త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (CENTRAL MINISTER KISHAN REDDY) తెలిపారు. అందులో భాగంగానే 18 వందల ఏళ్ల చరిత్ర కలిగిన నేషనల్ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనాన్ని(National Archives of India building) ఆయన సందర్శించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

By

Published : Jul 12, 2021, 4:41 PM IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారతదేశ రాజ్యాంగ (INDIAN CONSTITUTION) అసలు ప్రతులను యాప్ రూపంలో త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (CENTRAL MINISTER KISHAN REDDY) వెల్లడించారు. అందులో భాగంగానే 18 వందల ఏళ్ల చరిత్ర కల్గిన దిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనాన్ని(National Archives of India building ఆయన సందర్శించారు. భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన అసలు ప్రతులు, సభ్యులందరూ పెట్టిన సంతకాలతో పాటు స్వాతంత్రోద్యమ పోరాటాలు, ప్రభుత్వం జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, కోర్టు తీర్పులు, ఒప్పందాలు, మహాత్మాగాంధీకి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ మ్యూజియంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనంలో ఉన్న 18 కోట్ల పేపర్ పేజీలు, 57 లక్షల ఫైల్స్, 64 వేల అధ్యాయాలు, లక్షా 2 వేల చిత్రపటాలను త్వరలోనే డిజిటలైజేషన్ (CONSTITUTION DIGITALIZATION) చేసి యాప్​ని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజ్యాంగం గురించి చదువుకునే వీలు కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని... ప్రస్తుతం డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details