ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదల కోసం ఆరోగ్య పథకాలు తీసుకొచ్చాం: కిషన్‌రెడ్డి

పేదల కోసం అనేక ఆరోగ్య పథకాలు తీసుకొచ్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కొవిడ్ సేఫ్ ఇంక్యుబేటర్, డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ పాల్గొన్నారు.

minister kishan reddy
పేదల కోసం ఆరోగ్య పథకాలు తీసుకొచ్చాం: కిషన్‌రెడ్డి

By

Published : Dec 12, 2020, 5:38 PM IST

పేదల కోసం ఆరోగ్య పథకాలు తీసుకొచ్చాం: కిషన్‌రెడ్డి

ఇతర దేశాలపై ఆధారపడకుండా భారతదేశమే కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం పట్టుదలగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా టీకా కోసం ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఇతర దేశాల ప్రధానులు చేయని ప్రయత్నం మోదీ చేస్తున్నారని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వటానికి ప్రధాని హైదరాబాద్​లో పర్యటించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ సనత్‌నగర్​లోని ఈఎస్‌ఐ మెడికల్ కళాశాలలో డయాలసిస్‌ సెంటర్, పసిపిల్లల కోసం కొవిడ్ సెఫ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ కూడా పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రత్యేక టాస్క్​‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి వివరించారు. వ్యాక్సిన్ కోసం కృషి చేస్తూనే ఇతర దేశాలతో మోదీ సంబంధాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. టీకా రాగానే పంపిణీ కోసం చైన్‌ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో నూతన వైద్య పరికరాలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కార్మికుల కోసం అధునాతన వసతులను ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 2019 ఏడాదికి గాను దేశంలోనే ఉత్తమ మెడికల్ కళాశాల, ఉత్తమ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఈఎస్‌ఐకు అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్ ​ఇలా బుక్ చేసుకోం​డి

ABOUT THE AUTHOR

...view details