ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా..? కేసీఆర్‌పై కిషన్ రెడ్డి విసుర్లు - kishan reddy fires on kcr

kishan reddy fires on kcr: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీ పెడతామనటం ఈ దశాబ్దంలో పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని అభిప్రాయపడ్డారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : Sep 12, 2022, 7:56 PM IST

kishan reddy fires on kcr: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడతామనటం ఈ దశాబ్దంలో పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఉద్దరించమని రెండుసార్లు గెలిపిస్తే ఏం చేశారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్​లోని రామ్​లీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

''తెలంగాణను ఉద్దరించమని రెండు సార్లు గెలిపిస్తే... పాలన చేతగాక జాతీయ పార్టీ పెడతానంటున్నారు. అసలు 17 సీట్లలో కేసీఆర్‌కు వచ్చింది 9 సీట్లే... వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క సీటు కూడా రాదు. అన్ని పార్టీలు ఏకమైనా... నరేంద్ర మోదీని ఏం చేయలేరు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చారు. మోటర్లకు మీటర్లు పెట్టే అవసరం లేదు.. కానీ కేసీఆర్ అవినీతికి మాత్రం మీటర్లు పెడతాం.''-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఇంకా ఉంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని..ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.40 వేల కోట్లు నష్టాలు వచ్చాయని ఆరోపించారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆవేదన చెందారు.

''కేసీఆర్‌ను మించిన అరచకవాది, నియంతృత్వవాది ఇంకొకరు లేరు. వచ్చే ఎన్నికల్లో భాజపా వందశాతం సీట్లు గెలుస్తుంది. అందుకే కేసీఆర్ విష, అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రగతిభవన్ నుంచి ప్రజలు తరిమికొట్టే పరిస్థితి రాబోతుంది. 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారు.'' -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details