ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

2013 - 14 లెక్కల ప్రకారమే పోలవరం వ్యయం: కేంద్రం

2013 - 14 నాటి ధరలకే పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని పరిమితం చేసినట్లు... కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు.. ఈ విధంగా కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

polavaram
పోలవరం

By

Published : Feb 12, 2021, 10:24 AM IST

పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర ఆర్థికశాఖ 2013-14 నాటి ధరలకే పరిమితం చేసిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. సవరించిన అంచనాల కమిటీ సమావేశం తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

‘ఏపీ విభజన చట్టం రూపొందించే సమయంలో ఈ ప్రాజెక్టును మేమే చేపడతామని భారత ప్రభుత్వం చెప్పింది. కేబినెట్‌ నోట్‌లో 2013-14 నాటి ధరల ప్రకారం అయ్యే ఖర్చును కేంద్రం సమకూరుస్తుందని చెప్పారు. నిర్మాణంలో జాప్యం జరిగింది. దానివల్ల, కొత్త ఆర్‌ అండ్‌ ఆర్‌ అంశాల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. దీనిపై సవరించిన అంచనాల కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వశాఖ 2013-14 నాటి ధరల స్థాయికే పరిమితి (క్యాప్‌) విధించింది. నేను ఒకటి చెప్పదలచుకున్నాను. కేంద్రం రాబోయే రోజుల్లో సరైన సమయంలో, సరైన స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేపడుతుంది’ అని గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details