విభజన అంశాలపై కాసేపట్లో కేంద్ర హోంశాఖ సమీక్ష - central minister review
విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ మరోసారి దృష్టి పెట్టింది. ఉభయ రాష్ట్రాల పరిధిలోని సమస్యలపై కాసేపట్లో చర్చించనుంది.
![విభజన అంశాలపై కాసేపట్లో కేంద్ర హోంశాఖ సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4697909-thumbnail-3x2-home.jpg)
విభజన అంశాలపై ఇవాళ సాయంత్రం దిల్లీలో కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించనుంది. హాజరయ్యేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దిల్లీ వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమీక్ష జరుగనుంది. తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాలు సీఎంలు ఇప్పటికే ప్రధాని మోదీకి విభజన అంశాలను వివరించారు. అపరిష్కృతంగా ఉన్న 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TAGGED:
central minister review