ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై తీసుకున్న చర్యలేంటి.. ? : కేంద్ర హోంశాఖ

సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై
సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై

By

Published : Oct 9, 2021, 9:10 PM IST

Updated : Oct 9, 2021, 10:52 PM IST

21:08 October 09

సునీల్‌కుమార్‌పై తెలంగాణలో నమోదైన కేసులో చర్యలపై రఘురామ ఫిర్యాదు

ఏపీ సీఐడీ చీఫ్ పీవీ.సునీల్(APCID chief pv.sunil) కుమార్​పై నమోదైన కేసులో ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సునీల్ కుమార్ సతీమణి అరుణ... తెలంగాణ సీఐడీ(telangana CID) విభాగానికి చేసిన ఫిర్యాదు, అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్(FIR)​కు సంబంధించిన చర్యలు ఏం తీసుకున్నారో తెలియజేయాలంటూ నర్సాపురం ఎంపీ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ..  ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి వచ్చిన లేఖను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాల రాజు(revu muthyala raju) డీజీపీ గౌతమ్ సవాంగ్(DGP goutham sawang)కు పంపించారు. ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి డీజీపీకి సూచించారు.

ఇదీచదవండి.

GT Express : జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు... ఫైర్ ఫైటర్స్​తో మంటలార్పిన సిబ్బంది

Last Updated : Oct 9, 2021, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details