ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఫోన్ - సీఎం జగన్​ కు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి ఫోన్

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్​తో మాట్లాడానని, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కారణాలు తెలుసుకున్నానని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.

central helath minister calls to cm jagan
సీఎం జగన్​కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఫోన్

By

Published : Jul 16, 2020, 9:42 AM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్​తో మాట్లాడానని, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కారణాలు తెలుసుకున్నానని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచడంపై ఎక్కువ దృష్టి పెట్టామని, రోజుకు 22వేల పరీక్షలు చేస్తున్నామని సీఎం చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 'రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సోకినవారిలో మరణాల రేటు 1.17 శాతం ఉంది. దాన్ని ఒక్క శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. వైరస్ సోకినవారిని వెంటనే గుర్తించి చికిత్స అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం చెప్పారు' అని హర్షవర్ధన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా రోగుల చికిత్సకు 64వేల పడకలు సిద్ధంగా ఉన్నట్టు హర్షవర్ధన్ తెలిపారు. కరోనా నియంత్రణకు కేంద్రం రూ.179కోట్లు ఇచ్చినట్టుగా వెల్లడించారు.

ఇదీ చదవండి:

పేదల కుటీరం ఇదే...!!

ABOUT THE AUTHOR

...view details