ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lok Sabha 2021: కేంద్రం నుంచి తెలంగాణకు ఏడేళ్లలో రూ.1.63 లక్షల కోట్లు - telangana in parliament 2021

గడిచిన ఏడేళ్లలో తెలంగాణకు రూ.1,63,700 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఈ నిధులు.. పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇచ్చినట్లు తెలిపారు.

central
central

By

Published : Jul 27, 2021, 9:15 AM IST

తెలంగాణకు గడిచిన ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1,63,700 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, ఆ రాష్ట్రంలోని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

2014-15 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల మధ్య పన్ను వాటా కింద రూ.99,076.21 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.64,624.78 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద తెలంగాణకు రెండేళ్లలో 10,72,280 గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు బండి సంజయ్‌ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి రామేశ్వర్‌ తేలి సమాధానంగా చెప్పారు. 2018-19లో 9,23,800, 2019-20లో 1,48,480 కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు.

వ్యవసాయ రుణ బకాయిల్లో పదో స్థానంలో రాష్ట్రం

రుణబకాయిల పరంగా తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. అక్కడ 63,22,415 ఖాతాలపై రూ.84,005.43 కోట్ల రుణం ఉంది. ఒక్కో ఖాతాపై సగటున రూ.1,32,869 అప్పు ఉన్నట్లు తేలిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కారాడ్‌ తెలిపారు. కాగా, వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ రాష్ట్రంలోని 1,20,08,351 ఖాతాలపై రూ.1,69,322.96 కోట్ల రుణ బకాయిలున్నాయన్నారు. వ్యవసాయ రుణమాఫీ ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రిలో భూత వైద్యం.. డాక్టర్లు ఏం చేస్తున్నారు?

ABOUT THE AUTHOR

...view details