కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది ఏడో వాయిదా కింద రూ.1,438.08 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రూ.10,068.58 కోట్లు ఇచ్చినట్లయింది. దేశంలోని 17 రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.1,18,452 కోట్ల గ్రాంట్‌ను సిఫార్సు చేసింది. దాని ప్రకారం కేంద్రం సోమవారం ఈ రాష్ట్రాలన్నింటికీ కలిపి రూ.9,871 కోట్లు విడుదల చేసింది. దీంతో అన్నింటికీ కలిపి ఏడు వాయిదాల్లో రూ.69,097 కోట్లు (58.33%) చెల్లించినట్లయింది.
రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ.1,438.08 కోట్లు విడుదల - ఏపీకి కేంద్రం నిధులు
రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ.1,438.08 కోట్లు విడుదలయ్యాయి. 15 ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు గ్రాంట్‌ను విడుదల చేసింది.
central govt release funds to ap central govt release funds to ap