ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో జగన్ పథకాల పేర్లపై.. కేంద్రం తీవ్ర అభ్యంతరం

By

Published : Dec 3, 2021, 6:38 PM IST

Updated : Dec 3, 2021, 8:42 PM IST

central govt
ap govt

18:31 December 03

ప్రాయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టడంపై నివేదిక కోరిన కేంద్రం

Centre Objects Names of AP Government Schemes: ఆంధ్రప్రదేశ్​లో.. కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లు మార్చడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర పథకాల పేర్లను రాష్ట్రాలు తమకు నచ్చినట్లు మార్చడం కుదరదని స్పష్టం చేసింది. కేంద్ర పథకాలకు ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడం సరికాదని పేర్కొంది. 2021 -22 ఏడాది కింద ఐసీడీఎస్, ఐసీపీఎస్‌ పథకాలకు ఇచ్చిన 187 కోట్లకు లెక్కలు చూపాలని ఆదేశించింది.

ఎంపీ రఘురామ ఫిర్యాదు.. స్పందించిన కేంద్రమంత్రి

MP Raghu Rama letter to central minister smriti irani: ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చటంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రాలు తమకు నచ్చిన పేర్లు పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని కోరారు. ఎంపీ రఘురామ రాసిన లేఖకు సమాధానం చెప్పాలని.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి

PRC in Andhra Pradesh: పీఆర్‌సీ ప్రకటిస్తాం.. కానీ నివేదిక ఇవ్వలేం: కార్యదర్శుల కమిటీ

Last Updated : Dec 3, 2021, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details