పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ముందుగానే నిధులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్‌కు ఈ నిధులు విడుదల చేశారు. రాష్ట్రానికి 2018-19 ఏడాదికి రెండో విడతకు రూ.870.23 కోట్లు, 2019- 20 ఏడాదికి మొదటి విడత కింద రూ.431 కోట్లు విడుదలయ్యాయి.
కరోనాపై పోరు: స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు విడుదల - భారత్‌లో కరోనా ప్రభావం
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పారిశుద్ధ్య పనుల కోసం స్థానిక సంస్థలకు ముందుగానే నిధులు విడుదల చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తర్వులు జారీ చేశారు.
central government released funds to local bodies