కరోనా దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలు నిలిపివేయటంతో.. నిన్న మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి పయనమయ్యారు. నిన్నటినుంచి తాము ఇబ్బందులు పడ్డామని.. ఎట్టకేలకు భారత ప్రభుత్వం చొరవతో తాము బయల్దేరామని హర్షం వ్యక్తంచేశారు. తమకు సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
భారత్కు పయనమైన తెలుగు విద్యార్థులు - తెలుగు విద్యార్థులకు ప్రయాణ అనుమతి
మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఉండిపోయిన తెలుగు వైద్య విద్యార్థులు ప్రత్యేక విమానంలో భారత్కు పయనమయ్యారు. స్వదేశానికి వచ్చేందుకు 150 మంది తెలుగు వైద్య విద్యార్థులకు కేంద్రం ప్రయాణ అనుమతి ఇచ్చింది.
భారత్కు పయనమైన తెలుగు విద్యార్థులు