ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిత్తూరు, ప్రకాశం జిల్లాల యంత్రాంగాలకు కేంద్రం ఆదేశాలు - corona cases in chittoor

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆయా జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి, మరణాల రేటును 1 శాతం దిగువకు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించింది.

-corona-precautions
-corona-precautions

By

Published : Sep 5, 2020, 3:44 AM IST

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆయా జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ ఐదు రాష్ట్రాల్లోని 15 జిల్లాల అధికారులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి, మరణాల రేటును 1 శాతం దిగువకు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించింది.

ఆయా జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందునే ఈ సూచనలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. కంటైన్మెంట్‌ జోన్లను, హోమ్‌ ఐసోలేషన్‌ కేసులను కట్టుదిట్టంగా పర్యవేక్షించడం, కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం , సత్వర వైద్యం అందిచడం వంటి చర్యలు చేపట్టాలని కోరామన్నారు

ఇదీ చదవండి
సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి

ABOUT THE AUTHOR

...view details