ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Polavaram Project: 2014 ఏప్రిల్‌ నాటి అంచనా వ్యయమే భరిస్తాం: కేంద్రం - పోలవరం ప్రాజెక్ట్​ తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్‌ నాటి అంచనా వ్యయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్‌వర్క్స్‌, డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ చెప్పినట్లు వెల్లడించింది.

Central Minister Shekawat on Polavaram Redesign Expenditure
Central Minister Shekawat on Polavaram Redesign Expenditure

By

Published : Jul 26, 2021, 6:56 PM IST

పోలవరం విషయంలో 2014 ఏప్రిల్‌ నాటి అంచనా వ్యయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్‌వర్క్స్‌, డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ చెప్పినట్లు తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

గోదావరి ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని కేంద్రమంత్రి షెకావత్​ అన్నారు. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని తెలిపారు. కాఫర్‌ డ్యామ్‌, పునాది పనులు, స్పిల్‌వే, డయాఫ్రం వాల్‌ పనులు, చిప్పింగ్‌, స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు అదనంగా చేపట్టామని ఏపీ చెప్పినట్లు కేంద్రం తెలిపింది. అయితే వీటికోసం అదనంగా నిధులు కేటాయించబోమని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండే

ABOUT THE AUTHOR

...view details