Nirmala sitaraman: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీర్కూర్‌లో రేషన్ దుకాణాన్ని సందర్శించారు. ప్రజలకు ఇస్తున్న రేషన్ వివరాలను కలెక్టర్ జితేష్ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఎంత బియ్యం పంపిణీ చేశారని ప్రశ్నించారు. పేదలకిచ్చే బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో చెప్పాలని లబ్ధిదారుల ముందే నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర వాటాలు ఎంతో చెప్పాలంటూ లబ్ధిదారుల ముందు కలెక్టర్‌ను నిలదీశారు. పాలనాధికారి సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం కేవలం ఐదు రూపాయలు ఖర్చు చేస్తుందని నిర్మల అన్నారు. ప్రజలకు అసలు విషయం చెప్పాలనే పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ దుకాణం వద్ద పెట్టిన ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో లేకపోవడంపై కలెక్టర్‌ను ప్రశ్నించారు. మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. మరోసారి వచ్చేసరికి ప్రధాని ఫొటో ఉండాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.