ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రాల సీఎస్​లతో కేంద్రమంత్రి వర్గ కార్యదర్శి సమీక్ష - రాష్ట్రాల సీఎస్​లతో కేంద్రమంత్రి వర్గ కార్యదర్శి సమీక్ష న్యూస్

వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర మంత్రి వర్గ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులప ప్రగతిపై రాజీవ్ గౌబ చర్చించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిపై సీఎస్‌ నీలం సాహ్ని వివరించారు.

central-cs-reviews-on-solar-power-projects
central-cs-reviews-on-solar-power-projects

By

Published : Nov 29, 2019, 8:30 AM IST

రాష్ట్రాల సీఎస్​లతో కేంద్రమంత్రి వర్గ కార్యదర్శి సమీక్ష

సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి అంతర్‌రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ ఏర్పాటు అంశంపై దిల్లీ నుంచి మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సౌర విద్యుదుత్పత్తికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్న,ప్రతిపాదించిన ప్రాజెక్టుల ప్రగతిని సీఎస్లతో సమీక్షించారు.

గ్రీన్ ఎనర్జీ మొదటి,ద్వితీయ దశల కింద రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని సీఎస్‌ నీలం సాహ్ని వివరించారు.సోలార్‌ ఎవాక్యుయేషన్ స్కీమ్‌లో భాగంగా కర్నూలు జిల్లా గని వద్ద ఏర్పాటు చేసిన వెయ్యి మెగావాట్ల సోలార్‌ పార్కు,తలారి చెరువు వద్ద ఏర్పాటు చేసిన500మెగా వాట్ల సౌరవిద్యుత్‌ పార్కుల్లో ఇప్పటికే విద్యుదుత్పత్తి జరుగుతోందని తెలిపారు.కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్‌ పార్కు పనుల్లో...సమస్యల పరిష్కారానికి వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు.కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో4వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ఎస్..సీ.ఐ సంస్థ ముందుకు వచ్చిందని.... దీనికి అవసరమైన భూమి కేటాయింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సీఎస్ నీలం సాహ్ని రాజీవ్‌ గౌబకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details