సాధారణ బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపిన కేంద్రం.. రైలు మార్గాల విషయంలోనూ అదే మార్గాన్ని అనుసరించింది. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైలు మార్గానికి కేంద్రం గత సంవత్సరంలో ఇచ్చింది వెయ్యి రూపాయలు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిందీ వెయ్యి రూపాయలే! వాస్తవానికి 106 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ లైను అంచనా వ్యయం 2 వేల 679 కోట్లు. ఇప్పటివరకూ కేవలం 2 కోట్ల 20 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చుచేశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటయ్యే అవకాశాలు ఈ ఏడాదీ కనిపించట్లేదు. ఎందుకంటే తాజా బడ్జెట్‌లో నిధులేమీ కేటాయించలేదు. కనీసం ఈ జోన్ ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదు.
ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని జాతీయ ప్రాధాన్యమున్న, అనుసంధాన అవసరాలున్న ప్రాజెక్టులకు మాత్రం సంతృప్తికరంగానే కేటాయింపులు చేశారు. ప్రధానంగా నడికుడి-శ్రీకాళహస్తి లైను నిర్మాణానికి రూ.1,144 కోట్లు, విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను నిర్మాణానికి రూ.800 కోట్లు, కాజీపేట-విజయవాడ మూడో లైను విద్యుదీకరణకు రూ.300 కోట్లు కేటాయించారు. జోన్లవారీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి రైల్వే శాఖ బుధవారం రాత్రి పింక్ బుక్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.5,812 కోట్లు కేటాయించారు. 32 కొత్తలైన్లు, పాతవాటి డబ్లింగ్ పనులకు సంబంధించి ఈ నిధులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. 2009-14 మధ్య రాష్ట్రానికి రూ.886 కోట్లు కేటాయించగా రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే 556శాతం అధిక నిధులు ఇచ్చినట్లు చెప్పింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
*గూడూరు-దుగరాజపట్నం 41.55 కి.మీ., భద్రాచలం-కొవ్వూరు 151 కి.మీ., కంభం-ప్రొద్దుటూరు 142 కి.మీ., కాకినాడ-పిఠాపురం 21.5 కి.మీ., మాచర్ల-నల్గొండ 92 కి.మీ. లైన్లకు నామమాత్రంగా రూ.వెయ్యి చొప్పున నిధులు కేటాయించారు. దువ్వాడ-విజయవాడ మధ్య 355 కి.మీ. మూడో లైనుకూ నిధులు కేటాయించలేదు.
*విజయనగరం-సంబల్‌పూర్ మూడోలైనుకు రూ.450 కోట్లు కేటాయించారు.
*విజయవాడ-గూడూరు, విశాఖపట్నం-విజయవాడల మధ్య లాంగర్ లూప్ నిర్మాణానికి రూ.50 కోట్ల చొప్పన కేటాయించారు.
*గుత్తి-ధర్మవరం రెండో లైను నిర్మాణానికి రూ.225 కోట్లు ఇచ్చారు.
*తిరుపతి రైల్వేస్టేషన్ దక్షిణం వైపు భాగం ప్రవేశద్వారం అభివృద్ధికి రూ. కోటి మంజూరుచేశారు.
*తిరుచానూరు రైల్వేస్టేషన్‌ను సీ కేటగిరీ నుంచి