ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bridge: కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం

Center approves iconic bridge: కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై వెయ్యి 82 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు.

KRISHNA BRIDZE
కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన

By

Published : Oct 14, 2022, 11:03 AM IST

Updated : Oct 14, 2022, 12:10 PM IST

కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం

Krishna river iconic bridge:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సోమశిల వద్ద కృష్ణానదిపై కేంద్రం ప్రభుత్వం వంతెన నిర్మించనుంది. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెనగా ఈ వారధి నిలిచిపోతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఐకానిక్‌ వంతెన రూపు రేఖల ఫొటోలను గడ్కరీ ట్విటర్‌లో పంచుకున్నారు.

15 ఏళ్ల చిరకాల స్వప్నం:ప్రపంచంలో రెండోవ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని తెలిపారు. వంతెనలో పాదచారుల మార్గం గాజుతో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గోపురం ఆకారంలో పైలాన్‌, లైటింగ్ వ్యవస్థ ఉంటుందన్నారు. చుట్టూ నల్లమల అడవులు, ఎత్తైన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్‌ పరిసరాలతో ఈ వంతెన మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ వంతెన నిర్మాణంతో ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది.

తెలంగాణలోని కొల్లాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించాలంటే కృష్ణానదిలో పడవ ప్రయాణమే శరణ్యం. రెండు రాష్ట్రాల మధ్య రహదారి మార్గంలో రాకపోకలు సాగించాలంటే సుమారు వంద కిలోమీటరు చుట్టుతిరిగి రావాల్సిందే. 2007లో కృష్ణానదిలో పడవ మునగటంతో 61మంది జలసమాధి అయ్యారు. కృష్ణ నదిపై వంతెన నిర్మించాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ఈ క్రమంలోనే వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.

వంతెనకు అనుసంధానంగా తెలంగాణలోని కల్వకుర్తి-నాగర్‌కర్నూల్‌-కొల్లాపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్‌-నంద్యాల మార్గాన్ని కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారిగా గుర్తించింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టుతిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వంతెన ఏర్పాటుతో హైదరాబాద్‌- తిరుపతి మధ్య 80 కిలో మీటర్ల దూరం తగ్గనుంది.

ఇవీ చూడండి:

Last Updated : Oct 14, 2022, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details